పర్యావరణాన్నిపెంచడమే జనసేన పార్టీ లక్ష్యం : జనసేన నాయకులు

జనసేన

     ఎమ్మిగనూర్ ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా రేఖా గౌడ్, ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు మండలం తిమ్మాపురం గ్రామంలో జనసేన పార్టీ కార్యక్రమాల్లో భాగంగా ప్రతి ఇంటికి మొక్కల పంపిణీ మరియు జనసేన పార్టీ ఎన్నికల గుర్తు అయినా గాజు గ్లాస్ ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస్ రాష్ట్ర కార్యదర్శి రవి ప్రకాష్ ఎమ్మిగనూరు మండలం ప్రధాన కార్యదర్శి బజారి కరణం రవిలు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్ధాంతాల్లో ఒకటైన పర్యావరణ పరిరక్షణ లో భాగంగా ప్రతి గ్రామంలో మొక్కులు నాటాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని అన్నారు. ప్రతి పౌరుడు తమవంతుగా బాధ్యతగా మొక్కలు నాటాలని పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో ప్రజలు ఒక్కసారి జనసేన వైపు చూడాలని గాజు గ్లాస్ గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి వేయించి భారీ మెజారిటీతో జనసేన పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కృష్ణ మల్లికార్జున, గోవర్ధన్, మణి, రాముడు, రంగన్న తదితరులు పాల్గొన్నారు

See also  మదనపల్లిలో నిర్విరామంగా సాగుతున్న జనసేన ఇంటింటికి ప్రచారం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి