అక్రమ అరెస్టులతో జనసేనపార్టీని అణచలేరు : చిత్తూరు జిల్లా కార్యదర్శి AP శివయ్య

      చిత్తూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ జనసేనపార్టీని అణచివేతకు గురిచేస్తూ, అక్రమ అరెస్టులకు పాల్పడుతుందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ కార్యదర్శి ఏపీ శివయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా ప్రతిపక్షంలో ఉండే నాయకులు ప్రజల తరపున నిరసన కార్యక్రమాలు చేపట్టడం సహజం. ఐతే మన రాష్ట్రంలో అధికార వైసీపీ పార్టీ నేతలు గర్జన పేరుతో కార్యక్రమాలు నిర్వహించి ప్రతిపక్ష పాత్ర కూడా తానే పోషించాలని అనుకొంటుందని తెలిపారు. ఈ సందర్భంగా “జనవాణి” కార్యక్రమం కోసం విశాఖ విచ్చేసిన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అడుగడుగునా పోలీసు ఆంక్షలతో అడ్డుకోవడమే కాకుండా పార్టీ యొక్క ముఖ్య నాయకులను సైతం అక్రమ అరెస్టులు చేయడం దారుణం అని, వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.

See also  ఆముదాలవలస నియోజకవర్గంలో జనసైనికుల ఆత్మీయ సమావేశం