జనసైనికుడిని సత్కరించిన జనసేన నాయకులు

జనసేన

        కదిరి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే వారికి కొండంత అండగా నిలవాలని క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియను ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో జనసేన పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న కార్యకర్తలకు 286 మందికి కూటాల లక్ష్మన్న సభ్యత్వం నమోదు చెయ్యడం జరిగింది. కదిరి నియోజక వర్గంలో అత్యధిక సభ్యత్వాలు నమోదు చేసిందుకు జన సేనపార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలుపుతూ సత్కరించారు. ఆయన మాట్లాడుతూ నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము కానియ్యకుండా పార్టీ బలోపేతం కోసమే కృషి చేస్తానని తెలిపారు. ఈ అవకాశం కల్పించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు, ఇతర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. 

See also  శాకాంబరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన దేవిచౌక్ అమ్మవారు