సమస్యలని గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేన జనసేన నాయకులు భరత్

జనసేన

          నెల్లూరు ( జనస్వరం ) : రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో చేస్తున్న పవనన్న ప్రజా బాట, పాదయాత్ర వల్ల ప్రజల సమస్యలను గుర్తించి, పరిష్కరించే పార్టీగా జనసేనని ప్రజలు చూస్తున్నారని జనసేన నాయకులు భరత్ అన్నారు. ఆయన మాట్లాడుతూ  ఆ సమస్యలని జనసేనాని మాత్రమే పరిష్కరించగలరని ప్రజలు అభిప్రాయ పడుతున్నారన్నారు.  జనవాణి కార్యక్రమం ద్వారా సామాన్య ప్రజల సమస్యలను చాలా వరకు పరిష్కారం అయ్యాయని తెలిపారు. ఇక నియోజకవర్గ పరిధిలో సమీక్షలు, నిర్వహించి పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర మొదలు పెడితే రాబోయే ఎన్నికల్లో గెలుపు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, బ్లడ్ క్యాంప్ లు నిర్వహిస్తూ ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రజల కొరకు ప్రజలలో ఒకరు వచ్చి పెట్టిన పార్టీ జనసేన అని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. 

See also  పేదలకు నిత్యావసర సరుకులు అందించిన జనసేన నాయకులు