
నివర్ తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయం అందించాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు
నివర్ తుఫాన్ వలన దెబ్బతిన్న పంటకు, నష్టపోయిన రైతాంగానికి తక్షణ సాయంగా 10 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు జగ్గయ్యపేట నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్, బాడిస మురళీకృష్ణ ఆధ్వర్యంలో స్థానిక అప్సర థియేటర్ నందు గల శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద సామూహిక నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. అనంతరం జగ్గయ్యపేట మండల తహశీల్ధారు వారికి వినతిపత్రం అందచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ నివర్ తుఫాన్ వలన రాష్ట్ర వ్యాప్తంగా 17 లక్షల 37 వేల ఎకరాలలో పంట నష్టం జరిగిందని, అదే విధంగా జగ్గయ్యపేట నియోజకవర్గ పరిధిలో సుమారుగా 500 ఎకరాలకు పైగానే నష్టం జరిగిందని, వరితో పాటుగా పలు పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. ఈ ఏడాది వరసగా మూడు ప్రకృతి వైపరీత్యాలు సంభవించటంతో రైతులకు కోలుకోలేని దెబ్బతగిలిందని, పడిపోయిన పంటలు తీసుకోడానికి కూడా ఆర్ధిక పరమైన ఇబ్బందులు రైతులకు ఉన్నాయని అందుములంగానే ఎకరాకు 35 వేల రూపాయలు నష్ట పరిహారం అవసరమని తక్షణ సాయం కింద 10 వేల ఇస్తే వాలిన పంట తీసుకోటానికి వీలుగా ఉంటుందని, రైతులు మనోధైర్యం కోల్పోకుండా, ఆత్మహత్యలు ఆగలంటే తక్షణ సాయం అందించాలని మా అధ్యక్షుల వారు డిమాండ్ చేసారని ఆయన తెలిపారు. ఆ దిశగా ప్రభుత్వానికి 48 గంటల సమయం కూడా ఇచ్చామని, అయినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన, అందుకోసమే నష్టపోయిన రైతాంగానికి అండగా నిలిచేందుకు నిరసన వ్యక్తం చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తునికపటి శివ, నాగ, చారి, నవీన్, గోపి, త్రిశాంత్, నరసింహ, శ్రీకాంత్, పవన్, హేమంత్, రాం తదితరులు పాల్గొన్నారు.








