
వై యస్ ఆర్ జలకళ పథకంపై తక్షణమే అసైన్డ్ కమిటీ ఏర్పాటు చేసి రైతులకు పాస్ బుక్స్ కల్పించాలి : జగ్గయ్యపేట జనసేన నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుల కోసం ఏర్పాటు చేసిన వై యస్ ఆర్ జలకళ పథకం అనేది ప్రతి ఒక్క రైతుకు ఉపయోగపడే విధంగా పాస్ బుక్స్ కల్పించాలని ముఖ్యంగా జస్టిస్ పున్నయ్య కమిషన్ సిఫార్సుల మేరకు యస్ సి (SC) ఆక్ట్ అసైన్డ్ క్రింద ఉన్న వారికి కూడా కల్పించే విధంగా కొన్ని చర్యలు తీసుకుని తక్షణమే రాజకీయ నాయకుల సమక్షంలో అసైన్డ్ కమిటీ ఏర్పాటు చేసి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని జనసేన పార్టీ తరుపున జగ్గయ్యపేట నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల తహశీల్ధారు వారికి వినతిపత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ వై యస్ ఆర్ జలకళ పథకం అనేది అర్హత ఉన్న ప్రతి ఒక్క రైతుతో పాటుగా చిన్న సన్నకారు రైతులకు కూడా ఉపయోగపడేలా చూడాలని, ఆడంగల్ (సాగుబడి), 1బి ఆసామి (యజమాని), పాస్ బుక్ (పట్టాదారు) ఈ పథకానికి అర్హులైన వారందరికీ ఇవన్నీ కావాలని, లేని ఎడల ఆన్లైన్ లో అప్లోడ్ అయ్యే పరిస్థితి లేదు అని, కనుక తక్షణమే రాజకీయ నాయకుల సమక్షంలో ఒక అసైన్డ్ కమిటీ ఏర్పాటు చేసి తక్షణమే రైతులకు ఈ పాస్ బుక్స్ కల్పించి ఈ పథకాన్ని పునరుద్ధరించాలని లేని ఎడల ఈ పథకానికి తూట్లు పొడిచినట్టు అవుతదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగ, గోపి, నరసింహ, శ్రీకాంత్, దేవ తదితరులు పాల్గొన్నారు.








