సమస్యలను తీర్చమని మున్సిపనల్ కమీషనర్ కు వినతి పత్రం అందించిన జగ్గయ్యపేట జనసైనికులు

సమస్యలను తీర్చమని మున్సిపనల్ కమీషనర్ కు వినతి పత్రం అందించిన జగ్గయ్యపేట జనసైనికులు. 

జగ్గయ్యపేట పట్టణ ప్రజలు మరి గత కొన్ని నెలలుగా పట్టణంలో పశువులని రోడ్ల మీదకి వదలటం వలన పట్టణ ప్రజలు వారి పనులకి ఇబ్బంది పడటమే కాకుండా మరి ట్రాఫిక్ కి కూడా తీవ్ర అంతరాయం కలుగుతుంది అని జనసేన పార్టీ తరుపున నియోజకవర్గ నాయకులు ఈమని కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్థానిక పట్టణ మున్సిపల్ కమీషనర్ వారికి వినతిపత్రం అందచేయటం జరిగింది. వివరాలలోకి వెళ్తే మరి పట్టణంలో కొన్ని కొన్ని ప్రదేశాలలో ముఖ్యంగా రద్దీగా ఉండే ప్రదేశాలలో కోదాడ రోడ్ లోని స్ధానిక నారాయణ స్కూల్ దగ్గర, కమల థియేటర్ సెంటర్ నందు మరియు రైతు బజార్ సెంటర్ నందు ఆవులు రోడ్ కి ఇపువైపులా నిలిచి ఉండడంతో మరీ కూరగాయలు మరియు పండ్ల వ్యాపారస్తులకు మరియు మండల గ్రామాలలో నుంచి వస్తున్న ప్రజలకి సైతం వారి పనులకి ఇబ్బంది కలగటమే కాకుండా పట్టణంలో ట్రాఫిక్ కూడా ఎక్కువగా పెరగటం వంటి పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి అని, రాత్రి వేళలో అవి రోడ్ మీద ఉన్న విషయం తెలియక చిన్న పాటి ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటున్నాయి అని ఆయన తెలిపారు. అదే విధంగా ఈ పశువుల వలన వీధులలో చెత్త కోసం ఏర్పాటు చేసిన డంపింగ్ బాక్సులని సైతం అవి చెల్లా చెదురు చేయటం జరుగుతుంది అని, దాని వలన పక్కన నివసిస్తున్న కుటుంబాలకి డయేరియా వంటి ప్రమాదాలు కలగటమే కాకుండా అందులోను కరోనా తీవ్రంగా వ్యాపిస్తున్న వేళ ఇంకా ఎక్కువ ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. మరీ తక్షణమే వీటి మీద చర్యలు తీసుకుని వాటిని అరికట్టవలసిన బాధ్యత ఎంతయినా ఉంది పశువులను మనం సంరక్షించుకోవాల్సిన అవసరం ఉందని తక్షణమే గోశాల వంటి ప్రదేశాలు ఏర్పాటు చేసి వాటికి స్థావరం ఏర్పాటు చేయవలసినదిగా నియోజకవర్గ ప్రజల తరుపున, జనసేన పార్టీ తరుపున, పవన్ కళ్యాణ్ గారి తరుపున కోరుచున్నాము అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో తరుణ్, రవి, శివ, త్రిశాంత్, ఆసిఫ్, పాషా, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

See also  రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసైనికుడి కుటుంబానికి ఆత్మకూరు జనసేన పార్టీ తరుపున రూ. 15,000 ఆర్థిక సహాయం