జగ్గయ్యపేట నియోజకవర్గ లోతట్టు గ్రామ ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న జనసైనికులు

జగ్గయ్యపేట నియోజకవర్గ లోతట్టు గ్రామ ప్రజలు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్న జనసైనికులు                

         జగ్గయ్యపేట నియోజకవర్గంలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాల వలన అలాగే పక్క రాష్ట్రాల్లో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న వేళ భారీగా వరద నీరు విడుదల కావటంతో నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక పెనుగంచిప్రోలు మండలంలో ఉన్నటువంటి మునేటి వాగుకి ఇప్పటికే భారీగా వరద నీరు వచ్చి చేరడంతో బ్రిడ్జ్ మీదకి నీరు వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు, ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని నియోజకవర్గ జనసేన నాయకులు ఈమని కిషోర్ కుమార్ పత్రిక ముఖంగా తెలియచేసారు. ఈ కార్యక్రమంలో కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ లో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింన వేళ వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు అని, దాని ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. దీని వలన ఇప్పటికే నియోజకవర్గంలో ని స్థానిక మునేటి వాగు నిడిపోవడంతో ఆవులు కాసుకునే వారు వాగులో ఇరుక్కుపోవటం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయని, అలాగే స్థానిక లింగాల బ్రిడ్జ్ కి కూడా వరద నీరు వచ్చి చేరుతుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ఆయన సూచనలు చేసారు. అలాగే ప్రభుత్వం వారు కూడా సంబంధిత అధికారులని, రెస్క్యూ టీం వారిని ప్రజల సౌకర్యార్థం కోసం అందుబాటులో ఉంచాలని ఆయన తెలియచేసారు.

See also  ప్రమాదవశాత్తూ మరణించిన ప్రణయ్ కుమార్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన కావలి జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి