ఐటెం రాజా, ఐటెం రాణి మంత్రులు – పవన్ కళ్యాణ్ పై విమర్శలు తప్ప అభివృద్ధి ఎక్కడ ?? : మైఫోర్స్ మహేష్

మైఫోర్స్ మహేష్

             మదనపల్లి ( జనస్వరం ) :  ఐటెం రాజా, ఐటెం రాణి మంత్రుల తీరు అసహ్యంగా వుందని జనసేన పార్టీ రాయల దక్షిణ కోస్తా సంయుక్త పార్లమెంటరీ సమన్వయ కర్త మైఫోర్స్ మహేష్ విమర్శించారు. మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మంత్రులు రోజా, గుడివాడ అమరనాథ్, అంబటి రాంబాబు లపై విమర్శలు గుప్పించారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మంత్రులు, ఎమ్మెల్యే ప్రవర్తనతో యువత రాజకీయాల వైపు చూడాలంటేనే భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బులుగు రోజా, గంట రాంబాబు, డ్యాన్స్ అమరనాథ్ అంటూ ఎద్దేవా చేశారు. ‌యువతకు ఆదర్శంగా వుండాల్సిన ప్రజాప్రతినిధుల తీరు సక్రమంగా లేదన్నారు. మంత్రి రోజా, గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు పై విమర్శలు గుప్పించారు. ప్రభుత్వం 175 సీట్లు వస్తాయని చెప్పడం కాదని 30, 40 సీట్లకు పడిపోయి ప్రతిపక్షంలోకి వైకాపా వెళ్లిపోక తప్పదని హెచ్చరించారు వైకాపా మంత్రులు పవన్ కళ్యాణ్ ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తల గురించి జపం చేయనిదే వైకాపా నాయకులకు నిద్ర పట్టడం లేదని విమర్శించారు. జనసేన పార్టీ నాయకులు పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు కార్యకర్తలు పని చేస్తారని అన్నారు.

See also  కార్యకర్తలకు అండగా ఉండే ఏకైక పార్టీ జనసేన పార్టీనే : జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి