
హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరం : అల్లూరి రవీంద్ర
రాష్ట్రంలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులను జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ నాయకులు ఆల్లూరి రవీంద్ర ఖండించారు. వారు స్థానిక విలేకరులతో మాట్లాడుతూ… హిందూ దేవాలయాలపై దాడులు జరగడం దురదృష్టకరమని పిఠాపురంలో జరిగిన దేవత మూర్తుల విగ్రహాల ధ్వంసం, కొండ బిట్రగుంట రథం దహణం , అంతర్వేదిలో జరిగిన లక్ష్మీ నరసింహస్వామి రథం దహణం చూస్తుంటే కొన్ని దృష్టశక్తులు కావాలనే హిందువుల మనోభావాల దెబ్బతినేలా, విద్వేషాలు రెచ్చ కొట్టేలా ప్రయత్నాలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు సర్వమతాలను గౌరవిస్తారని, సంప్రదాయ, ఆచారాలకు విలువ ఇస్తారని వారు తెలిపారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విధంగా రిటైడ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేయాలని జనసేన నాయకులు అల్లూరి రవీంద్ర గారు అన్నారు.








