రాష్ట్రాన్ని అప్పుల ఊబి నుండి కాపాడేది జనసేన, టిడిపి ప్రభుత్వమే

   మదనపల్లి ( జనస్వరం ) : పట్టణంలోని నీరుగట్టు వారి పల్లె టిప్పుసుల్తాన్ కాంప్లెక్స్ వెనుక వీధిలో జనసేన టిడిపి ఉమ్మడి ప్రచారం జరిగింది. మదనపల్లి జనసేన నాయకులు శ్రీరామ రామాంజనేయులు ఆధ్వర్యంలో జనసేన చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత, యాసిన్, తొక్కోల శివ అధ్యక్షతన జరిగింది. మొన్న జరిగిన యువకులం సభకి భారీ ఎత్తున ప్రజల స్వచ్ఛందంగా వచ్చారని సభ విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. అలాగే లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని బయటకు తేవాలంటే కేవలం జనసేన టిడిపి ఉమ్మడి ప్రభుత్వమే దిక్కని ప్రజల స్వచ్ఛంగా చెప్పడం అనేది గుర్తించదగిన విషయమని అన్నారు.  ఈ కార్యక్రమంలో మదనపల్లి జనసేన నాయకులు చంద్రశేఖర్, హరి గోవిందు, విశ్వనాథ్, విజయమ్మ, సుకన్య రాణి తదితరులు పాల్గొన్నారు. 

See also  గ్రామ గ్రామాన జనసేనపార్టీని బలోపేతం చేయడమే మన లక్ష్యం : కృష్ణా జిల్లా జనసేనపార్టీ ఉపాధ్యక్షులు బొలియశెట్టి శ్రీకాంత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :