
– అమ్మవారి ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని పునరుద్ధరించాలి
– అమ్మవారి ఆలయానికి రూ.70 కోట్లు నిధులు ప్రకటించి మూడు సంవత్సరాలు అవుతున్న నిధులు ఎక్కడ?
విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో అమ్మవారి ధార్మిక సేవ మండలి విలేకరుల సమావేశం ఏర్పాటు నిర్వహించారు. ఈ సమావేశంలో ధార్మిక మండలి సభ్యులు నారంశెట్టి కూర్మా రావు మాట్లాడుతూ ఇది దేవాలయమా? లేక వైసీపీ కార్యాలయమా? అని ఎద్దేవా చేశారు. దసరా మహోత్సవాల్లో వీఐపీల పేరుతో వైసీపీ కండువా కప్పుకొన్న ప్రతి ఒక్కరికి విఐపి పాసులు ఇవ్వటం దేవస్థానంలో ఐదు స్లాట్ లు సుమారుగా 10 గంటల దర్శన సమయం కేవలం వారికే కేటాయించి రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే లక్షలాది భక్తులకు కేవలం 5 గంటల దర్శన సమయం మాత్రమే కేటాయించారంటేనే అమ్మవారి భక్తులపై వారికి ఎంత సర్ద ఉందో అర్థమవుతుందన్నారు. పాత మంత్రి అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అయితే, కొత్త మంత్రి నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనంగా దర్శనాలు చేయించే వైసీపీ నాయకుల దళారీ వ్యవస్థగా ఏర్పాడి వీఐపీలు అనే నెపంతో దర్శనం చేపించి డబ్బులు తీసుకునే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. సామాన్య భక్తులకే ప్రాధాన్యం ఇవ్వాలి లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. మరో సభ్యురాలు శానంపూడి శిరీష మాట్లాడుతూ అమ్మవారి ఆలయంలో అన్నదానం కార్యక్రమాన్ని నిలిపివేసి దేవాదాయ శాఖ మంత్రి ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపించడం దుర్మార్గమన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని పునరుద్ధరించాలని , ఆలయంలో అన్యమతస్తులకి కాంట్రాక్టు కట్టబెడుతున్నారని, హిందూ మనోభావాలతో మంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఆలయంలో లిఫ్ట్ సౌకర్యం వీఐపీలకు మాత్రమేనని దేవాదాయ శాఖ మంత్రి అనడం ఎంత దుర్మార్గమన్నారు. మీ పదవులు ఉన్నది భక్తులకి అమ్మవారికి సేవ చేయడానికి గాని వైసిపి నాయకులకి, వీఐపీలకి అడుగులకు మడుగులు వత్తడానికి కాదని, దేవాదాయ శాఖ మంత్రి విఐపి ల భజనలు మాని ఆలయం ఎలా అభివృద్ధి చేయాలో దృష్టి సారించాలని, రాబోయే దసరా ఉత్సవాల్లోకి పలు ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని, ఈవోకి ఎండోమెంట్ కమిషనర్ కి పలు సమస్యలపై గతంలో ఫిర్యాదులు చేసిన అవి చెత్త బుట్టమ్మకే పరిమితం అవుతున్నాయని తెలియజేశారు. పరిష్కారం వైపు గా ముందుకు సాగటం లేదని, ఇదేవిధంగా కొనసాగిస్తే మేము పోరాటం చేస్తామని హెచ్చరించారు. మరొక సభ్యులు కరిమికొండ శివరామకృష్ణ మాట్లాడుతూ 2020లో స్వయానా సీఎం దసరా నవరాత్రుల కోసం అమ్మవారి దేవాలయనికి రూ.70 కోట్ల నిధులను ప్రకటించారని, నిధులు ప్రకటించి కూడా మూడేళ్లు అవుతున్న ఒక్క రూపాయి కూడా అమ్మ వారి ఖాతాలో జమ చెయ్యలేదని, ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనబడుతుందని, సదరు ఈ విషయం పైన గత 2021 సంవత్సరంలో మేం ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినా ఫలితం లేకపోయిందని, ముఖ్యమంత్రి, దేవాదాయ శాఖ మంత్రి, అమ్మవారి దర్శనానికి వచ్చే ముందు గతంలో ఇచ్చిన 70 కోట్ల నిధులను విడుదల చేసిన తర్వాత అమ్మవారి దర్శనానికి రావాలని సీఎం జగన్, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ మా సవాలుని స్వీకరించాలని, గత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆలయాలకు చేసిన అభివృద్ధి కన్నా అవినీతిపైన ఎక్కువ దృష్టి కేంద్రీకృతం చేశారని, ఆయన బాటలోనే నూతన దేవాదాయ శాఖ మంత్రి నడుస్తున్నారని అనుమానం వస్తుంది. ప్రస్తుత దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కూడా దేవాలయాల ఆస్తులను కూల్చే కార్యక్రమం అనుసరిస్తున్నారని, దుర్గగుడి వద్ద నిర్మించిన పెర్గుల రాతిమ మండపాన్ని తొలగించి వీఐపీ లకు పార్కింగ్ ఏర్పాటు చేయాలని ఉద్దేశం వ్యక్తపరిచారంటేనే వైసీపీ ప్రభుత్వం వారు కూల్చటానికి ముందుంటారని, వాళ్ళ ఆనవాయితీని కొనసాగిస్తున్నారని తేటతెల్లమైందని, రాతి మండపాన్ని కూల్చటాన్ని జనసేన పార్టీ వ్యతిరేకస్తుందని అటువంటి చర్యలు జరిగితే పోరాటానికి కూడా వెనకాడభోమన్నారు. ఈ విలేకరుల సమావేశంలో నిత్తల ఉమామహేశ్వరి, బుద్దిన ప్రసాద్, రేవడి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.








