అనంతపురం జనసేన పార్టీ ఆధ్వర్యంలో “ఇంటింటా జనసేన”

       అనంతపురం, (జనస్వరం) : అనంతపురం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని అర్ ఎఫ్ రోడ్, ఖాజా నగర్, తిలక్ రోడ్డుల్లో క్రియాశీలక సభ్యులను కలిసి జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఏ ఆశయ సాధన కోసమైతే జనసేన పార్టీని స్థాపించారో… ఆ ఆశయాలను వివరిస్తూ ప్రజలతో మమేకమై స్థానిక సమస్యలు తెలుసుకొని జనసేనపార్టీ ఆవశ్యకతను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భవాని నగర్ మంజునాథ్, గుండ్రగొడ్డలి ఎర్రి స్వామి, దుశ్వంత్ ఏకాంత్, ప్రవీణ్ కుమార్, నారాయణ నాయక్, హేమంత్ నాయక్, కళ్యాణ్, కర్ణ, పురుషోత్తం నాయక్, రాజు, మహేష్ కుమార్, పోతురాజుల అశోక్, పబ్బిశెట్టి మంజునాథ్, ప్రవీణ్ కుమార్, వెంకటకృష్ణ, ప్రతాప్, జనసేన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

See also  విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ లు చుట్టూ ప్రహారి గోడ నిర్మించాలని ADA అధికారికి వినతి పత్రం అందించిన పత్తికొండ జనసేన నాయకులు