చెరుకు రైతుల బకాయిలు చెల్లించాలని జనసేనపార్టీ ఆధ్వర్యంలో నిరాహార దీక్ష

   విజయనగరం, (జనస్వరం) : విజయనగరం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట షుగర్ ఫ్యాక్టరీ చెరుకు రైతులకు, కార్మికులకు బకాయిలు చెల్లించాలంటూ జనసేనపార్టీ ఆధ్వర్యంలో బొబ్బిలి రైల్వేస్టేషన్ జంక్షన్ దగ్గర నిరాహారదీక్ష చేపట్టారు. NCS షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం బకాయిలు చెల్లించకుండా రైతులను, కార్మికులను ఇబ్బంది పెడుతున్నారు. NCS షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం చెల్లించాల్సిన చెరకు రైతుల బకాయిలను, ఫ్యాక్టరీ కార్మికుల 8 నెలల జీతాలను YCP ప్రభుత్వం జనవరి 10 లోపు చెల్లించి, పర్యావరణ పరిరక్షణకు విభిన్నంగా ఫ్యాక్టరీ నుంచి వ్యర్థాలను విడుదల చేసి కాలుష్యపూరిత గ్రామంగా మార్చేసిన కింతలవానిపేట గ్రామస్తులకు ఆరోగ్య భద్రత కల్పించి, ఫ్యాక్టరీని ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బాబు పాలూరు మరియు జనసైనికులు బొబ్బిలిలో నిరాహార దీక్ష చేపట్టారు.

See also  రామచంద్రపురం మండలంలో జనసేన నాయకులు ఆత్మీయ సమావేశం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి