ఉంగుటూరు నియోజకవర్గంలో జనంలోకి – జనసేన

     ఉంగుటూరు, (జనస్వరం) : ఉంగుటూరు నియోజకవర్గంలోని భీమడోలు మండలం మూడో రోజు జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కొండ్రుపాడు, దుద్దేపూడి గ్రామాలలో పెద్దలను కలిసి పవన్ కళ్యాణ్ ఆశయాలను, జనసేన పార్టీ సిద్ధాంతాలను ప్రజలకు వివరించారు. వచ్చే శాసనసభ ఎన్నికల్లో నిజాయితీపరుడు నిబద్దత కలిగిన పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రి చేయాలని ఉంగుటూరు నియోజకవర్గం జనసేనపార్టీ ఇంచార్జ్ పత్సమట్ల ధర్మరాజు కోరారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన నాయకులు, జనసేన వీర మహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.

See also  పోలవరం వంతెన నుండి ప్రజలు ప్రాణాలు కాపాడాలి : అక్కల రామమోహనరావు (గాంధీ)