ప్రభుత్వ పథకాలు అందడం లేదని చెబితే కేసులు పెడతారా? చిత్తూరు జిల్లా జనసేన నాయకులు

      చిత్తూరు, (జనస్వరం) : చిత్తూరు జిల్లా, పూతలపట్టు నియోజకవర్గం, వేపనపల్లి గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో తమకు రావాల్సిన సంక్షేమ పథకాలు రావడం లేదన్న విషయాన్ని ఎమ్మెల్యేకు విన్నవించుకున్న వారి మీద అక్రమ కేసులు నమోదు చేయడం భావ్యం కాదని చిత్తూరు జిల్లా జనసేన నాయకులు తెలిపారు. జనసేన పార్టీ కుటుంబానికి చెందిన ఐనా జశ్వంత్ ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి ప్రభుత్వ పథకాల గురించి ఆరా తీస్తే సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారన్న అక్కసుతో 16 ఏళ్ళ ఆ యువకుడిని పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లి అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నాం. జశ్వంత్ కుటుంబానికి మద్దతుగా వెళ్లిన మా పార్టీ నాయకుల మీద అక్రమంగా ఎస్సీ, ఎస్టీ కేసులు మోపడం వైసీపీ ప్రభుత్వం వైఖరిని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

See also  త్రాగునీటి పైపులకు మరమ్మతులు చేయాలని RWS అధికారికి వినతిపత్రం ఇచ్చిన ఉరవకొండ జనసేన నాయకులు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :