అంగన్వాడి పాఠశాలకు సీలింగ్ ఫ్యాన్ ను అందించిన ఇచ్ఛాపురం జనసేన నాయకులు

    ఇచ్ఛాపురం, (జనస్వరం) : శ్రీకాకుళం జిల్లా, కవిటి మండలం ఇచ్ఛాపురం నియోజకవర్గం దూగానపుట్టుగ గ్రామపంచాయతీలో గల అంగన్వాడి కేంద్రంలో ఉన్నటువంటి ఒక్క ఫ్యాన్ తో పిల్లలు ఇబ్బంది పడుతున్న కారణంగా ఇంకో ఫ్యాను అవసరం ఉంది అని అంగన్వాడి టీచర్ జనసేన నాయకులును కోరడం జరిగింది. ఈరోజు జనసేన పార్టీ తరఫున ఒక సీలింగ్ ఫ్యాన్ అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కవిటి మండలం జనసేన నాయకులు హేమా చలపతి దివాకర్, మనోజ్, శివాజీ, సిసింద్రితో పాటు జనసేన కార్యకర్తలు, వీర మహిళలు, అంగన్వాడి టీచర్ హేమలత పాల్గొనడం జరిగినది.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఇచ్చాపురం జనసేన పార్టీ సమన్వయకర్త దాసరి రాజు అభినందిస్తూ ఇలాంటి మరెన్నో కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకు వెళ్లవలసిందిగా కోరడం జరిగింది.

See also  మహశాంతియుత ధర్నాకి 300వ రోజు సంఘీభావం తెలిపిన జనసేన రాష్ట్ర కార్యదర్శి శివదత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి