దంతులూరి రామచంద్ర రాజు ఆధ్వర్యంలో ఇంటిఇంటికి జనసేన

     విజయనగరం, (జనస్వరం) : ఇంటిఇంటికి జనసేన కార్యక్రమంలో భాగంగా విజయనగరం జిల్లా, చీపురుపల్లి నియోజకవర్గం ఎస్.ఎస్.ఆర్. పేట గ్రామంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు దంతులూరి రామచంద్ర రాజు, ఆదివారం ఉదయం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్ర రాజు, జిల్లా నాయకులు ఆదాడ మోహనరావు, వంక నరసింగరావు ప్రతీ ఇంటిఇంటికి వెళ్లి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపడుతున్న రైతుభరోసా ఆర్ధికసాహాయం కోసం, ప్రజలపక్షాన చేస్తున్న ఉద్యమాలు, వివిధ ప్రజాసమస్యలపై గళమెత్తిన తీరును వివరిస్తూ స్థానిక సమస్యలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టిలో పెట్టి, వాటి పరిష్కారం దిశగా, ప్రజలకు అండగా ముందుకెళ్తామని తెలిపారు.

See also  ప్రజాస్వామ్య వ్యవస్థ పరిరక్షణకు ఓటే వజ్రాయుధం : జనసేన నాయకులు సత్య ప్రసాద్ దేశినీడి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి