డోన్ నియోజకవర్గంలో ఇంటి – ఇంటికీ జనసేన సిద్ధాంతాలు

     డోన్, (జనస్వరం) : కర్నూలు జిల్లా డోన్ నియోజక వర్గం, ప్యాపిలి మండలం, PR పల్లి గ్రామ జన సైనికుడు మధు అధ్యక్షతన జరిగిన సమావేశానికి డోన్ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు శ్రీ బాలు యాదవ్ హాజరై గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని కోరుతూ, గ్రామంలోని ప్రజలకు పవన్ కల్యాణ్ గారి ఆశయాల గురించి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానాల గురించి, పవన్ కల్యాణ్ గారి గొప్ప వ్యక్తిత్వం గురించి, వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల గురించి తెలియ చేస్తూ, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా జనసేన పార్టీని గెలిపించుకోవడమే ఏకైక లక్ష్యంతో పనిచేయాలని బాలు యాదవ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ జనసైనీకులు పాల్గొన్నారు.

See also  రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేదు, ప్రభుత్వంకు చిత్తశుద్ది లేదు : చిత్తూరు జనసేన సంయుక్త కార్యదర్శి కీర్తి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి