అక్రమంగా అరెస్ట్ చేసిన హిందూ నాయకులను విడుదల చేయాలి : గునుకుల కిషోర్

అక్రమంగా అరెస్ట్ చేసిన హిందూ నాయకులను విడుదల చేయాలి : గునుకుల కిషోర్

       విశ్వ భారత్ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందువులపై జరుగుతున్న దాడిని, దానిని నిరసిస్తూ ర్యాలీ చేస్తున్న జనసేన, బీజేపీ కార్యకర్తల అరెస్టు ఖండిస్తూ జిల్లా కలెక్టరేట్ దగ్గర జనసేన బీజేపీ సంయుక్తంగా విశ్వ భారతి హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగిన ధర్నాలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ బంగ్లా కి వెళ్లి సమస్యను వివరించి కలెక్టర్ గారికి వివరించి ఈ సమస్యపై తగు విచారణ జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని లేకపోతే రాబోయే రోజుల్లో నిరసన మరింత వెలువెత్తుతాయనీ తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి గారు, జిల్లా ఇన్చార్జి భరత్ కుమార్ గారు, సురేందర్ రెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి, సురేష్ రెడ్డి, జనసేన పార్టీ నుంచి గునుకుల కిషోర్, డాక్టర్ అజయ్ కుమార్, శ్రీకాంత్,సావిత్రి ఉషారాణి, ప్రశాంత్ గౌడ్, ప్రశాంత్, సుల్తాన్ భాష, బాలాజీ కోట, తిరుపతి బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

See also  శిథిలావస్థలో ఆసియా ఖండంలోనే అతిపెద్ద స్పిన్నింగ్ మిల్లు : గుంతకల్లు జనసేన నాయకులు