వైసీపీ ప్రభుత్వానికి హైకోర్టు తీర్పు చెంపపెట్టు : చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నరసింహ

వైసీపీ

                   కడప ( జనస్వరం ) : టీటీడీ పాలక మండలి సభ్యుల నియామకంపై హైకోర్టు తీర్పుని జనసేన స్వాగతిస్తుందని చిట్వేలి జనసేన నాయకులు మాదాసు నర్సింహులు అన్నారు. ఆయన మాట్లాడుతూ తిరుమల పాలక మండలి రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చిన వైసీపీ ప్రభుత్వం హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిది అన్నారు. ఇప్పటికైనా వైసీపీ ప్రభుత్వం హిందూ దేవాలయ పవిత్రతను దెబ్బతీయకుండా అర్హులైన వారికి ఆగమ శాస్త్రం ప్రకారం ఆధ్యాత్మిక చింతన అపారమైన భక్తి భావం ఉన్నవారికి మాత్రమే అవకాశం కల్పించాలన్నారు. మొదటి నుండి టీటీడీ పవిత్రతను దెబ్బతీయాలన్న వైసీపీ ప్రభుత్వం కుట్రను హిందూ సమాజం తెలుసుకోవాలన్నారు. రాజకీయ అవసరాల కోసం టీటీడీ అనర్హులను చూపించడాన్ని జనసేన ఎన్నటికీ సహించమని మాదాసు నరసింహ అన్నారు. 

See also  ప్రజలపై పన్నుభారం సరికాదు, అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తాం : జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి