
– వేసవిలో అధిక ఎండలను తట్టుకునే పత్తి పంటకు ‘పాహి’ మందు ఉపయోగకరం
– అధిక దిగుబడులు సాధ్యమని స్ట్రింగ్ కంపెనీ ప్రతినిధుల వెల్లడి
నంద్యాల, మే 13 (జనస్వరం) : రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులతో పాటు నాణ్యమైన ఉత్పత్తులను ఉపయోగిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని స్ట్రింగ్ కంపెనీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ప్రతినిధి సంటిగారి అశోక్ రాజ్ వర్ధన్ తెలిపారు. బుధవారం కర్నూలు జిల్లా కోడుమూరు మండలం లద్దగిరి గ్రామంలో రైతులకు పత్తి పంటలో ‘పాహి’ అనే నూతన ఉత్పత్తిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వేసవికాలంలో 43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితుల్లో కూడా పత్తి పంటను ఎండ, బెట్ట నుంచి రక్షించి అధిక దిగుబడులు సాధించేందుకు ‘పాహి’ మందు ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. రైతులు మన్యం సుదర్శన్, తలారి అరవింద్ సాగు చేసిన పత్తి పొలాల్లో డెమో నిర్వహించి, స్ట్రింగ్ బయో ప్రైవేట్ లిమిటెడ్, బెంగుళూరు తయారు చేసిన ఈ జీవ ఉత్ప్రేరక మందు ప్రయోజనాలను వివరించారు. ‘పాహి’లో జీవ ఉత్ప్రేరక సమ్మేళనాలు, ప్రోటీన్ హైడ్రోలైసేట్ ఉండటంతో పత్తి పంటలో ఎర్ర తెగులు నివారణ, అధిక పూత, సైడ్ కొమ్మల పెరుగుదల, ఆరోగ్యవంతమైన పంట అభివృద్ధికి ఉపయోగపడుతుందని తెలిపారు. పత్తి నాటిన 30 రోజుల తర్వాత ఎకరాకు 500 మిల్లీలీటర్ల చొప్పున వాడాలని రైతులకు సూచించారు. స్ట్రింగ్ కంపెనీ గత 14 సంవత్సరాలుగా రైతులకు జీవ ఉత్ప్రేరకాలు, సూక్ష్మ పోషకాలను అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా – మేక్ ఫర్ ది వరల్డ్’ లక్ష్యంతో భారతదేశంలో తయారైన ఈ ఉత్పత్తులను ఇతర దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో గత రెండు సంవత్సరాలుగా రైతులకు అవగాహన కల్పిస్తూ సేవలందిస్తున్నామని చెప్పారు. వరి, మొక్కజొన్న, పత్తి, మిరప, టమోటా, పూలు, పండ్ల పంటల్లో కూడా ఈ ఉత్పత్తులు మంచి ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. కర్నూలు జిల్లాలో తొలిసారిగా ‘పాహి’ మందు వినియోగాన్ని రైతులకు పరిచయం చేయడంలో కంపెనీ ప్రతినిధులు మధు, కోటేశ్వరరావు, రాజన్నలు కృషి చేశారని అశోక్ రాజ్ వర్ధన్ అభినందించారు.









