
గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కటకం అంకారావు సామాజిక సేవకు స్పూర్తికి నిదర్శనం
గురజాల నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కటకం అంకారావు సామాజిక సేవా స్ఫూర్తి కి నిదర్శనం అన్నట్టుగా ఉంటాయి ఆయన కార్యక్రమాలు. జనసేనాని అడుగుజాడల్లో నడుస్తూ,పల్నాడు వ్యాప్తంగా కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా, తాను ముందుండి ఆ సమస్య పరిష్కారం చేసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. పల్నాడు వ్యాప్తంగా చిన్నారులపై జరుగుతున్న, అత్యాచారాలను వెంటనే ఖండిస్తూ, మాచర్ల మండలం కొత్తపల్లి గ్రామంలో మనిషా అనే చిన్నారిపై అత్యాచారం చేసి చంపేస్తే ఆ కుటుంబానికి అండగా ఆమరణ నిరాహారదీక్ష చేసి ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇప్పించటంలో ఆయన కీలకపాత్ర పోషించి శభాష్ అనిపించుకున్నారు. ఎండాకాలంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తిని తీర్చి ప్రజల మన్ననలు పొందారు. కరోనా వైరస్ అనే మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా పట్టి పీడిస్తుంటే, తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా అన్ని శాఖల వారికి సానిటైజర్స్,మాస్కులు పంపిణీ చేయడమే కాకుండా, గురజాల లో ఉన్నటువంటి 2000 కుటుంబాలకు పైగా కూరగాయల పంపిణీ చేసి, సుమారు 150 కుటుంబాలు పైగా నెలకు సరిపడా, నిత్యావసర సరుకులు పంపిణీ చేసి సమాజం పట్ల ఆయనకున్న మానవత్వాన్ని చాటుకున్నారు. గ్రామ గ్రామాన తిరుగుతూ జనసైనికుల కష్టసుఖాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ వారికి భరోసానిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పోలీస్ శాఖ వారి సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా మొక్కలు నాటించారు.ముఖ్యంగా దుర్గి మండలం ధర్మవరం గ్రామంలో తిరుణాల సందర్భంగా ఏర్పడిన ఒక గొడవ లో అక్రమంగా 34 మంది పై కేసులు పెడితే సమస్యను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి,వారందరికీ న్యాయం చేసే విధంగా ఆయన ముఖ్య పాత్ర పోషించారు. రక్తదానం చేయండి ప్రాణ దాతలు కండి అనే నినాదంతో సుమారు ఆరు నెలల వ్యవధిలో 80 మందికి పైగా రక్తదానం చేయించి వారి ప్రాణాలును నిలబెట్టారు. జనసేనాని బాటలో నేను సైతం అంటూ అంకారావు చేసే కార్యక్రమాలు వలన అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు.








