
అనంతపురము, జనవరి 5 : జిల్లాకు చెందిన తెలుగు పండితులు, రచయిత, సీనియర్ పాత్రికేయులు గుంటి మురళీకృష్ణ భరద్వాజ్ కు సోమవారం ఘన సత్కారం జరిగింది. అనంత బ్రాహ్మణ సేవాసంస్థ, అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన సేవలను కొనియాడారు. ఉపాధ్యాయునిగా, రచయితగా, పాత్రికేయునిగా గుంటి మురళి సుదీర్ఘ సేవలు అందిస్తున్నారని ప్రశంసించారు. తెలుగు భాష, సాహిత్యం అభ్యున్నతికి నిరంతర కృషి సాగిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు బ్రాహ్మణ సంఘం నాయకులు పాల్గొన్నారు.








