అనారోగ్య బాధిత ఎన్నారై జనసైనికుడికి గల్ఫ్ జనసేన ఆర్థిక సహాయం అందజేత

అనకాపల్లి, జనవరి 14, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం తగరంపూడి గ్రామానికి చెందిన ఎన్నారై జనసైనికుడు మావూరు సతీష్ గత ఏడాది కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వైద్య చికిత్స కోసం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం గల్ఫ్ జనసేన కన్వీనర్ అమీర్ ఖాన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమాచారానికి స్పందించిన అమీర్ ఖాన్ చొరవతో జనసేన పార్టీ తరఫున బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించే ఏర్పాట్లు చేపట్టారు. ఈ క్రమంలో అనకాపల్లి జనసేన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ వైస్ ప్రెసిడెంట్ యాకుబ్ ఖాన్ చేతుల మీదుగా మావూరు సతీష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. దూర ప్రాంతాల నుంచి వచ్చి కుటుంబానికి అండగా నిలవడం, ఈ సహాయ కార్యక్రమం అనకాపల్లి జనసేన కార్యాలయంలో జరగడం ఎంతో సంతోషకరమని పార్టీ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకు వచ్చిన ప్రతి విరాళదాతకు పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైస్ ప్రెసిడెంట్ యాకుబ్ ఖాన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కష్టకాలంలో “మేమున్నాం” అంటూ ముందుకు వచ్చిన జనసేన శ్రేణులు, ఆర్థిక సహకారం అందించిన ప్రతి ఒక్కరికి మరోసారి పాదాభివందనాలు చేస్తూ పార్టీ నాయకులు జై జనసేన నినాదాలతో తమ ఐక్యతను చాటారు.

See also  హిందూపురం జనసేన ఇన్‌చార్జ్ ఉమేష్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చక్రి