ఏకగ్రీవంగా ఎన్నికైన సభ్యులకు అభినందనలు తెలిపిన గుడివాడ నియోజకవర్గ జనసేన నాయకులు

           కృష్ణాజిల్లా గుడివాడ నియోజకవర్గం వడ్లమన్నాడు గ్రామ పంచాయతీలో రెండు వార్డులు ఏకగ్రీవంగా గెలవడం జరిగింది. ఆరవ వార్డు మరియు రెండో వార్డు అభ్యర్థులు మాదాసు వెంకట కృష్ణ ప్రసాద్ మరియు అడపా జాస్తి రాణిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గెలిచిన వార్డు మెంబర్లు మాట్లాడుతూ ఎన్నికల్లో డబ్బు పంచకుండా ప్రజాస్వామ్యంగా గెలిచామని అన్నారు. గ్రామ అభివృద్ధికి సహకరిస్తామని అన్నారు. ఈ విజయానికి సహకరించిన మచిలీపట్నం పార్లమెంటరీ ఇంచార్జ్ బండి రామకృష్ణ, గుడ్లవల్లేరు మండలం రూరల్ జనసేన మండల పార్టీ అధ్యక్షుడు పేర్ని జగన్, తోట చిన్నారి, బొల్లా కింగ్, తూము బాబురావు, గంట చైతన్య, గెలిచిన అభ్యర్థులకు అభినందనలు తెలియజేశారు.

See also  సమస్యలపై నెల్లూరు జనసేన పార్టీ నాయకులను ఆశ్రయించిన సన్నకారురైతులు