ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ కెనడా నోవా స్కోటియా రాష్ట్ర సమన్వయకర్తగా గుద్దేటి బాల విశ్వనాథ్ నియామకం

అమరావతి, జూలై 3, (జనస్వరం): ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT Society) ప్రపంచవ్యాప్తంగా ప్రవాసాంధ్రులకు సేవలను మరింత విస్తరించేందుకు వివిధ దేశాలు, రాష్ట్రాలకు సమన్వయకర్తలను నియమించింది. ఈ మేరకు విడుదల చేసిన అధికారిక జాబితాలో కెనడాలోని నోవా స్కోటియా రాష్ట్రానికి గుద్దేటి బాల విశ్వనాథ్ను రాష్ట్ర సమన్వయకర్త (State Coordinator)గా నియమించింది. ఈ నియామక ఉత్తర్వులను ఏపీఎన్‌ఆర్‌టీ సొసైటీ ముఖ్య కార్యనిర్వాహక అధికారి విడుదల చేశారు. ఈ నియామకం పట్ల ప్రవాస తెలుగు సంఘాల ప్రతినిధులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. గుద్దేటి బాల విశ్వనాథ్ నాయకత్వంలో కెనడాలోని నోవా స్కోటియా ప్రాంతంలో ప్రవాసాంధ్రులకు మరింత సమర్థవంతమైన సేవలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ఆయనకు అభినందనలు తెలుపుతూ, నూతన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.

See also  దొర్నిపాడు మండలంలో వైసీపీ నుండి 50 కుటుంబాలు జనసేన పార్టీలోకి చేరిక