ఘనంగా రామయ్య స్వామి ఆరాధన

సీతారామపురం, మార్చి 30 (జనస్వరం) : సీతారామపురం మండలంలోని బసినేనిపల్లి సమీపంలోని శివాలయంలో ఉన్న ఆధ్యాత్మికవేత్త రామయ్య స్వామి అనారోగ్య కారణాలతో మరణించిన విషయం తెలిసిందే. సోమవారం రామయ్య స్వామి ఉత్తర క్రియలను ఆయన ఆశ్రమంలో నిర్వాహకులు నిర్వహించారు. అనంతరం రామయ్య స్వామి ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. రామయ్య స్వామి ఉత్తర క్రియల కార్యక్రమంలో సీతారామపురం మండల వైఎస్ఆర్సిపి కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి, వైస్ ఎంపీపీ బసిరెడ్డి కృష్ణారెడ్డి పాల్గొని రామయ్య స్వామి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రామయ్య స్వామి సీతారామపురం మండలానికి ఆధ్యాత్మిక దిక్సూచిగా నిలిచారని, ఆయన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైసీపీ ప్రధాన కార్యదర్శి బాలేనేని మాబయ్య తదితరులు పాల్గొన్నారు.

See also  మోంథా తుఫాను ప్రభావిత ప్రాంతాలకు సహాయక చర్యల్లో ముందుండండి – జనసేన నాయకులు శెట్టి ఆనంద్