
లక్ష్మంపల్లి, అక్టోబర్ 05, (జనస్వరం) : శెట్టూరు మండలంలోని లక్ష్మంపల్లి పంచాయతీ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మెగా పేరెంట్స్ మీటింగ్ 3.0 కార్యక్రమాన్ని విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల పాల్గొనికతో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల ప్రగతి దిశగా తల్లిదండ్రుల భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సమావేశానికి జనసేన నాయకులు లక్ష్మణ్, రాజగోపాల్, తెలుగుదేశం పార్టీ నాయకులు బుజ్జప్ప, మరిస్వామి, ఖాదర్ వలీ, వీరభద్రతో పాటు స్కూల్ కమిటీ చైర్మన్ బాబు హాజరయ్యారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు, పాఠశాల నిర్వహణ, తల్లిదండ్రుల బాధ్యతలపై ఉపాధ్యాయులు ప్రత్యేకంగా వివరించారు. కార్యక్రమంలో భాగంగా సాంస్కృతిక ప్రదర్శనలు, ఆటల పోటీలు నిర్వహించగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమన్వయం పాఠశాల అభివృద్ధికి ఎంతో మేలు చేస్తుందని నిర్వాహకులు పేర్కొన్నారు.








