కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి: అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు

అనకాపల్లి

                 కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను ప్రభుత్వం ఆదుకోవాలని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అనకాపల్లి నియోజకవర్గ ఇంఛార్జ్ పరుచూరి భాస్కర్ రావు అన్నారు. ఇటీవల గవరపాలెం, విజరామరాజుపేట, తుమ్మపాల గ్రామాలలో కరోనా తో మరణించిన పలువురు జనసేన కార్యకర్తల కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. వీరు పార్టీ బలోపేతం కోసం చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. వారు కరోనాకు బలికావడం పార్టీకి తీవ్ర నష్టం అని అన్నారు. మృతుల కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా తాకాశి ఉమామహేశ్వరరావు (బాబు) గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘానంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో అనకాపల్లి నియోజకవర్గ  నాయకులు ,జనసైనికులు  తదితురులు పాల్గొన్నారు.

See also  పెన్షన్ వ్యవహారములో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారిని కలసి వినతి పత్రం అందించిన జనసేన నేత డాక్టర్ యుగంధర్ పొన్న

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :