
చేనేత కార్మికులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి : గునుకుల కిషోర్
జనసేన పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ ఇంచార్జి చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి సూచన మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామం మరియు నెల్లూరు రూరల్ నారాయణరెడ్డి పేట లో ఉంటున్న చేనేత కార్మికుల కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్న జిల్లా నాయకులు కిషోర్ గునుకుల గారు. కన్ను,కాలు,చెయ్యి అవయవాలన్నీ ఏకాగ్రతతో పనిచేస్తే గానీ ఒక రోజుకి ఒక చీరని కూడా తయారుచేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇద్దరు కలిసి పని చేస్తే రోజు కి 500 వందలు కూడా రాని దుర్భరమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, మారని వారి జీవన ప్రమాణాలు. ఇదే పరిస్థితి కొనసాగితే భారత సంప్రదాయానికి ప్రతీకగా నిలిచిన చేనేత రంగం పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి. ఆ రంగంలో ఉన్న కార్మికులు ఎవరూ తన తర్వాతి తరాన్ని ఆ రంగంలో నైపుణ్యాన్ని నేర్పించి ఆ రంగంలో ఉంచాలి అనుకోవడంలేదు. ఆసామి దగ్గర ముడిసరుకు తెచ్చుకొని ఆసామి దగ్గర కూలి పొందడం తప్ప వారికి వేరే మార్గం లేదు . ప్రభుత్వం వెంటనే ఆదుకొని ముడి సరుకులు రుణ సదుపాయం కలగజేసి చేనేత నేసిన వారే స్వయంగా మార్కెట్లో అమ్మే పరిస్థితి తీసుకు వచ్చేటట్లు, కరోనా మహమ్మారి వలన 9 నెలలు మరియు భారీ వర్షాల కారణంగా పనుల్లేక పూర్తిగా కరువు సమస్యలు ఎదుర్కొంటున్న వారి జీవన విధానాన్ని అధినేత పవన్ కళ్యాణ్ గారికి దృష్టికి సమాచారం అందించి చేనేత కార్మికులకు అండగా జనసేన పార్టీ నిలుస్తుందని అన్నారు. జిల్లాలో చేనేత కార్మికుల సమస్యలు వాటి వివరాలు సేకరించి రాష్ట్ర కార్యాలయం పంపించి వారికి తగు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ అండగా ఉంటుందని గునుకుల కిషోర్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మికులు తవుడు గారు, వెంకటేశ్వర్లు గారు, లక్ష్మణ్రావు గారు, ధనుంజయ గారు మరియు జనసైనికులు పాల్గొన్నారు.








