
న్యూస్ ( జనస్వరం ) : కాపు సంక్షేమ సేన అధ్యక్షులు చేగొండి హరి రామ జోగయ్య గారు గ్లోబల్ ఎన్‌ఆర్‌ఐ జనసేన వింగ్ – జనసైనికులతో జూమ్ కాల్ సమావేశంలో ప్రత్యేకంగా మాట్లాడారు. హరి రామ జోగయ్య గారు జిల్లా పరిషత్ చైర్మైన్ గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 3 సార్లు ఎమ్మెల్యేగా, 1 సారి ఎంపీగా, వివిధ పర్యాయాలుగా మంత్రిగా కూడా పని చేశారు. రాజకీయ అపర మేధావి, రాజకీయ ఉద్ధండుడు అయిన హరి రామ జోగయ్య గారు రెండు తరాల రాజకీయ నాయకులకు వారధిగా నిలుస్తున్నారు. 90 ఏళ్ల వయసులో జనసేన పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తూ, పవన్ కళ్యాణ్ గారిని సీయం గా చూడాలన్న తపనతో రాజకీయంగా చురుగ్గా పాల్గొంటున్నారు. ఆయన మాట్లాడుతూ చాలా ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ అధికార ఆధిపత్య ధోరణి కేవలం రెండు కులాల మధ్య మాత్రమే ఉండటం వల్ల రాజకీయ సంక్షోభం, రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆ రెండు కులాలు కేవలం 10% మించి ఉండదు. మిగతా కులాలకు అధికారం దక్కకపోవడం వలన రాజకీయ స్తబ్ధత ఏర్పడింది. ఫలితంగా రాష్ట్ర అభివృద్ధి అంతంత మాత్రంగానే ఉండిపోయింది. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఇతర కులాల వారు యాచించే స్థానం నుండి శాసించే స్థాయికి ఎదగాలి. అపుడే రాష్ట్రంలో నూతన అధ్యాయం ప్రారంభం అవుతుంది. ఈ కులాల నుండి నీతి, నిజాయితీ, ప్రజల అభిమానం ఉన్న నాయకుడు ఉంటే అధికారం చేపట్టడం సులభం అవుతుంది. గతంలో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినపుడు నేను ఎంపీగా రాజీనామా చేసి ప్రజారాజ్యం పార్టీ కోసం పని చేశాము. ఆరోజు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, కాపులు చిరంజీవికి మద్దతు ఇచ్చి ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చేది. దురదృష్టావశాత్తు ఆయన సీయం కాలేకపోయారు. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. ఆ తర్వాత కళ్యాణ్ గారు జనసేన పార్టీ పెట్టారు. నా ఆశయాలకు, పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, జనసేనపార్టీ సిద్దాంతాలు దగ్గరగా ఉండటంతో మద్దతు ఇచ్చాను. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్ర తొందరగా ప్రారంభిస్తే బాగుంటుంది. తద్వారా ప్రజల్లో జనసేనపార్టీని మరింత బలంగా తీసుకెళ్లవచ్చు. జనసేన మ్యానిఫెస్టోను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాల్సిన అవసరం జనసేన నాయకుల మీద, పార్టీ కార్యకర్తల మీద ఉంది. జనసేన ప్రభుత్వం వస్తే సామాన్యుడికి ఎలాంటి పరిపాలన అందించగలుగుతుందో క్లుప్తంగా వివరించాలి. జనసేనపార్టీ మీద సామాన్య ఓటరుకి నమ్మకం, నిజాయితీ కల్పించాలి. జనసేనపార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమంతో పాటుగా అభివృద్ధి కూడా చేస్తుంది. జనసేనపార్టీ కేవలం ఏ ఒక్క కులానికో సంబంధించింది కాదు. అన్నీ కులాలకు సంబంధించిన పార్టీ. అందరం ఏకం అయితేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. అందరం ఆ విధంగా కష్టపడి జనసేనపార్టీని అధికారంలోకి తీసుకువద్దా౦, పవన్ కళ్యాణ్ గారిని సీయం చేద్దామని అన్నారు. ఇపుడు ఉన్న ప్రభుత్వం సంక్షేమం అంటూ లక్షల కోట్లు అప్పులు చేస్తూ, అభివృద్ధిని గాలికి వదిలేసింది. జగన్ ప్రభుత్వ సొమ్ముతో ౩ కోట్ల మంది ఓటర్లను కొనేస్తున్నాడు. అలాంటి వారితో యుద్ధం చేయాలంటే ఆచితూచి పొత్తు నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా పొత్తు నిర్ణయాలు జనసేనానికి వదిలేద్దాం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన అడుగుజాడల్లో నడిచి పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దామని అన్నారు. జనసేన పార్టీ చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలిపారు. వివిధ నియోజకవర్గాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం ఇచ్చారు.
జనసేన పార్టీ పిఏసి సభ్యులు చేగొండి సూర్య ప్రకాష్ గారు కూడా ఈ జూమ్ కాల్ సమావేశంలో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ 2019 ఎన్నికల్లో మనకు దాదాపుగా 6% ఓట్లు వచ్చాయి. కానీ ఇపుడు రెట్టింపు కంటే ఎక్కువ శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని చాలా సర్వేలు చెబుతున్నాయి. మరింత బలంగా కష్టపడదామని, క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం కోసం కృషి చేద్దామని తెలియజేశారు. కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కార్యకర్తలు తల ఎత్తుకునేలా నిర్ణయాలు తీసుకుంటారని, కావున పొత్తులు కూడా సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజారాజ్యంలో జరిగిన తప్పులని దృష్టిలో ఉంచుకొని పార్టీలోకి కొత్త నాయకులని తీసుకుంటున్నారన్నారు. రెండు పార్టీల ప్రభుత్వాలను ప్రజలను చూశారు. జనం కూడా కళ్యాణ్ గారి ప్రభుత్వాన్ని చూడాలని ఎదురుచూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీకి బలమైన స్పందన వస్తుందని అన్నారు. వివిధ నియోజకవర్గాల ఎన్‌ఆర్‌ఐ జనసైనికులు అడిగిన ప్రశ్నలకు ఓపికతో సమాధానం ఇచ్చారు.









