వీరఘట్టం మండలం జనసేనపార్టీ ఆధ్వర్యంలో గిరిసేన- జనం వద్దకు జనసేన

    వీరఘట్టం, (జనస్వరం) : వీరఘట్టం మండలంలో జనసేనపార్టీ ఆధ్వర్యంలో గిరిసేన- జనం వద్దకు జనసేన కార్యక్రమం (44)వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వీరఘట్టం అచ్చుప్ వలస గ్రామంలో పాలకొండ నియోజకవర్గ జనసేన పార్టీ పర్యటన చెయ్యడం జరిగింది. అక్కడ జరుగుతున్న మెగా క్రికెట్ టోర్నమెంట్ వద్ద క్రీడాకారులను ఉద్దేశించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ యువత కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న యువశక్తి కార్యక్రమం గురించి జనసేన జానీ మాట్లాడుతూ మన రాష్ట్రంలో ఎంతోమంది యువతీ యువకులు డిగ్రీల చేత పట్టుకొని నిరుద్యోగులుగా మారుతూ వలస పోతున్నారని మన రాష్ట్రంలో యువతీ యువకులకు ఒక ఉద్యోగం కూడా కల్పించడానికి చేతగాని ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఈనెల 12వ తేదీన రణస్థలంలో నిర్వహించు యువశక్తి కార్యక్రమానికి అధిక సంఖ్యలో యువత పాల్గొని నిరుద్యోగులుగా ఉన్న మాకు ఉద్యోగ క్యాలెండర్ లు తీసి ఉద్యోగ కల్పన అందించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకొని వరకు పోరాటం చేస్తామని జనసేన పార్టీ తరఫున ఈ యువశక్తి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాలకొండ నియోజకవర్గం నాయుకులు గొర్రిల. మన్మధరావు, మత్స. పుండరికం ప్రశాంత్, రమేష్, అనిల్, గణేష్, అనిల్, సాయిపవన్, ప్రమోద్, సుమన్, వినోద్, సందీప్, ప్రణీత్, దండేల సతీష్, వావిలపల్లి నాగభూషన్, కంటు మురళి తదితర జనసైనికులు పాల్గొన్నారు

See also  పల్లె పల్లెకు జనసేన కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో పర్యటించిన జనసేన నాయకులు మర్రపు సురేష్