డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలి : టెక్కలి జనసేన నాయకులు

       టెక్కలి, (జనస్వరం) : టెక్కలి మండలం మేఘవరం పంచాయితీ పరిధి బొరిగిపేట గ్రామంలో డ్రైనేజీలో పేరుకుపోయిన చెత్తను కొన్ని నెలలుగా పూడిక తీయకపోవటం వలన గ్రామంలో ప్రజలు అనేక వ్యాధులు గురి అవుతున్నారు. ఈ విషయాన్ని గ్రామ ప్రజలు జనసేన నాయకులు దృష్టికి తీసుకురావడం జరిగింది. దీనిపై స్పందించి చర్యలు తీసుకోవాలని టెక్కలి జనసేనపార్టీ తరుపున విజ్ఞప్తి చేస్తూ టెక్కలి మండలం అభివృద్ధి పరిపాలన అధికారికి వినతి పత్రం అందజేయడం జరిగిందిి. ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు కూరకుల యాదవ్, మెట్ట అవినాష్, టెక్కలి నియోజకవర్గ ఐటీ వింగ్ ప్రతినిధి రాయి సునీల్, ప్రోగ్రాం కమిటీ సభ్యులు పసుపురెడ్డి సోమేశ్  తదితరులు పాల్గొన్నారు.

See also  తుమ్మితే ఊడిపోయే మంత్రి పదవుల్లో ఉండే మీరా... పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించేది ? : వాసగిరి మణికంఠ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :