
పేద ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసిన గంగారావు
అమరావతి,ఏప్రిల్ 21 ( జనస్వరం)
బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, పేదల పాలిట పెన్నిధి, మానవత్వం ఉన్న నాయకుడు గుంజా గంగారావుని పేద ప్రజలు గుండెల్లో దాచుకుంటున్నారు. చంద్రబాబు మానస పుత్రిక ఫిఫోర్ (పి4) పథకంలో భాగంగా చంద్రబాబు ఆశయాలను కొనసాగిస్తూ పెదకూరపాడు శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ ఆదేశాలతో అమరావతి మండలం లేమల్లె గ్రామానికి చెందిన మైనార్టీ కుటుంబం మొఘలయ్య, రంజానబి కుమార్తెలు షర్మిల హసీనాకు పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బీసీ సెల్ అధ్యక్షులు గుంజా గంగారావు మంగళవారం లేమల్లె గ్రామంలోని ఇంటికి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి వెళ్లి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వయసుకు వచ్చిన ఆడపిల్లలు షర్మిల, హసీనా అనారోగ్యంతో వీల్ చైర్ కు పరిమితమయ్యారు.తండ్రి పక్షవాతంతో బాధపడుతుండగా తల్లి ఒక్కతే కుటుంబాన్ని అంతంత మాత్రంగా పోషిస్తుంది . క్రైంకౌంటర్ తెలుగు దినపత్రిక పెదకూరపాడు నియోజకవర్గ ఇన్చార్జి జర్నలిస్ట్ కోటేశ్వరావు ద్వారా అలానే పెదకూరపాడు నియోజకవర్గ P4 కోఆర్డినేటర్ సురేష్ కుమార్ ద్వారా విషయం తెలుసుకున్న గంగారావు వెంటనే స్పందించి సహాయాన్ని అందించారు. ఇక్కడ ఒక్కచోట మాత్రమే కాదు గంగారావు గతంలో పెదకూరపాడు మండలంలో అమరావతి మండలంలో సహాయ కార్యక్రమాలు చేపట్టారు. ఇటీవల స్థానిక శాసనసభ్యులు భాష్యం ప్రవీణ్ చేతుల మీదగా P4 కు సంబంధించి ప్రశంస పత్రం కూడా అందుకున్నారు.

ఆ కుటుంబం గంగారావు కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు.








