
గంగాధర నెల్లూరు మండల కేంద్రంలో నిరుద్యోగులకు అండగా జనసేన పార్టి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఇంఛార్జ్ యుగంధర్ పొన్న గారు పాల్గొన్నారు. అయన మాట్లాడుతు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు 2019 ఎన్నికల ముందు అనేక సభలలో 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత మాట మార్చి మడమ తిప్పారు. ప్రతి యేటా జనవరి 1వ తేది జాబ్ కేలండర్ ప్రకటన అని ఎన్నో తేదీలు మార్చి, 16/6/2021 వ తేది ప్రకటన చేసారు. గ్రూప్ 1 లో కేవలం 36 పోస్టులే ఖాళీలు చూపారు. పోలీసు ఉద్యోగ ఖాళీలు 450 మాత్రమే. ఎన్నికల సభలలో, పోలీసు అమరవీరుల దినోత్సవం రోజున సంవత్సరానికి 6500 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటన చేసారు. శాఖల వారీగా భర్తీ చేస్తున్నట్లు చెబుతున్నా పోస్టులు ఖాళీలు కూడా తక్కువ చేసి చూపించారు. ఉదాహరణకు రెవిన్యూ శాఖలో తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్లు, సర్వేయర్లు తదితర పోస్టులు అనేకం ఉన్నాయి. అసలు వాటి ప్రస్తావనే లేకుండా జాబ్ కేలండర్ ఇచ్చారు. జాబ్ కేలండర్ విషయంలో ప్రభుత్వానికి చిత్త శుద్ధి లేదు. ఏపిపియస్సి ద్వారా భర్తీ చేయదగ్గ ఉద్యోగాలు ప్రతి యేటా భారీగా కాళీ అవుతూ వుంది. ఆ లెక్కలను ప్రభుత్వం ఎందుకు దాచి పెడుతుంది? రాష్ట్రంలో వేల సంఖ్యలో ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. DSC నోటిఫికేషన్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు? సర్కార్ కు ఉపాధ్యాయ పోస్టులు నింపే ఉద్దేశం లేదు. గ్రామ సచివాలయాల్లో ఉన్న ఖాళీల మాటేమిటి? 30 లక్షల మంది నిరుద్యోగులు భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఉద్యోగాలకు వయస్సు మినహాయింపు లేదు. అవకాశాలను కోల్పోతున్నారు. అత్యంత విలువైన 5 సంవత్సరాల కాలం కోల్పోయారు. నిరుద్యోగ యువత దుష్ట రాజకీయ వలలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేసారు. కాబట్టి 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేసి, మాటలతో మాయచేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్య మంత్రి శ్రీ జగన్ మెహన్ రెడ్డి గారిపై ప్రజలలో కూడా చట్టం పట్ల సమాన భావన కలిగేటట్లు కేసు నమోదు చేసి, చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారికి లేఖను సమర్పించారు. ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు రాజు, నియోజకవర్గం సమన్వయకర్త గుణ శేఖర్, మండల నాయకులు రాకేష్, సూర్య, వేంకటాద్రి, ప్రసాద్, వర్మ, వరదరాజ్, కృష్ణయ్య, వెంకటేష్ మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.








