గడప గడపకు అంటూ దివ్యాంగులను, వృద్ధులను మళ్ళీ మోసం చేస్తున్న సీఎం

    బాపట్ల, (జనస్వరం) : బాపట్ల జనసేన పార్టీ కార్యాలయంలో పత్రికా ప్రకటన జనసేన పార్టీ జనసైనికుడు గోగన ఆదిశేషు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి గత మూడు సంవత్సరాలుగా దివ్యాంగులు, వృద్ధులను పట్టించుకోకుండా ఇప్పుడు గడప గడపకు అంటూ దివ్యాంగులను, వృద్ధులను వాటేసుకుంటూ వైసీపీ మంత్రులకు, ఎమ్మెల్యేలకు ఇప్పుడు గుర్తొచ్చారా? అని ప్రశ్నించారు. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కోన రఘుపతి  ఏ ఒక్క పని చేయకుండా మూడు సంవత్సరాల తర్వాత దివ్యాంగులు, వృద్ధులు ఇప్పుడు గుర్తొచ్చారా! నియోజకవర్గంలో ఉన్న వృద్ధులను, దివ్యాంగులను వాటేసుకుంటున్నా ఎమ్మెల్యే కోన రఘుపతి మళ్లీ మోసం చేసి ఎమ్మెల్యే అవుదామని ఇంటింటికి తిరుగుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని రాష్ట్రంలో ఉన్న ప్రజలు బాపట్ల నియోజకవర్గంలో ఉన్న ప్రజలు అందరూ తెలుసుకోవాల్సిందని జనసేన పార్టీ దివ్యాంగుల జనసైనికుడు గోగన ఆదిశేషు తెలియజేయడమైనది. ఈ కార్యక్రమంలో కంది వెంకటరెడ్డి, తాడిశెట్టి శ్రీనివాసరావు, షేక్ సుభాని తదితరులు పాల్గొన్నారు.

See also  అనారోగ్యంతో బాధపడుతున్న పాపకు ఆర్థిక సహాయం అందించిన జనసేన నాయకులు