జి.ఆర్ పుట్టినరోజు అంబరాన్నంటిన వేడుకలు

– రక్తదాన శిబిరంతో సేవా స్పూర్తి చాటిన జి.ఆర్ టీం

– గజమాలతో సన్మానం – కేక్ కట్‌తో వేడుకలు

అనంతపురం, మార్చి 30 (జనస్వరం) : జిల్లాలో జి.ఆర్ పుట్టినరోజు సందర్భంగా పలుచోట్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. పామిడి సామాజిక ఆరోగ్య కేంద్రంలో జి.ఆర్ టీం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా జి.ఆర్‌ను గజమాలతో సన్మానించి, కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. అనంతరం నిర్వహించిన రక్తదాన శిబిరంలో వందమందికి పైగా దాతలు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జి.ఆర్ మాట్లాడుతూ, “నా పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసి ప్రాణాలను కాపాడేందుకు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రక్తదానం ఒక మహత్తర సేవ అని, మనం ఇచ్చే రక్తం మరొకరి జీవితాన్ని నిలబెడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి” అని అన్నారు. ఈ కార్యక్రమంలో జి.ఆర్ టీం యువత, సంఘ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సేవా భావంతో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం అందరి ప్రశంసలు అందుకుంది. ముందుకు రాబోయే రోజుల్లో జి.ఆర్ టీం మరెన్నో కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని పేర్కొన్నారు.

See also  మట్టి వినాయకుడిని పూజిద్దాం- పర్యావరణాన్ని పరిరక్షిద్దాం