యువశక్తి ప్రోగ్రాంకి దళిత సత్తా సంపూర్ణ మద్దతు : రేగిడి లక్ష్మణరావు

రేగిడి లక్ష్మణరావు

             శ్రీకాకుళం ( జనస్వరం ) : ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనవరి 12వ తారీఖున జరగబోయే జనసేన పార్టీ యువశక్తి ప్రోగ్రాంకి దళిత సత్తా సంపూర్ణ మద్దతు ఇస్తామని రేగిడి లక్ష్మణరావు గారు పత్రిక సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల యువతకు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అలాగే పరిశ్రమలు లేకపోవడం, అలాగే ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఇంతవరకు కూడా విడుదల చేయకపోవడం యువతలో ఉన్నటువంటి ఆవేదన బాధని అసంతృప్తిని కలిగిస్తాయని అన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంపై తెలియపరచడానికి దళిత సత్తా ద్వారా యువశక్తి ప్రోగ్రాంకి తన గళాన్ని వినిపించడానికి సిద్ధం అవ్వడం జరిగింది. టిడిపి చంద్రబాబు నాయుడు పాలనలో స్వర్ణాంధ్రప్రదేశ్గా కీర్తించబడి అలాగే వైయస్ రాజశేఖర్ రెడ్డి పరిపాలనలో అన్నపూర్ణ ఆంధ్ర ప్రదేశ్ గా కీర్తించబడి న ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలన లో ప్యాక్షన్ ఆంధ్ర ప్రదేశ్ గా మారింది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో భారత రాజ్యాంగం బద్దంగా పరిపాలన జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజారెడ్డి రాజ్యాంగం పరిపాలన జరుగుతోంది. ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలు ఉండకుండా చేయడానికి ప్రతిపక్ష పార్టీలపైన నాయకులు పైన కార్యకర్తల పైన చేస్తున్నటువంటి భౌతిక దాడులను ఖండిస్తూ 2024 ఎన్నికలకు జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు దళిత సత్తా తరుపున ఉంటుందని తెలియజేశారు. 

See also  మానవత్వంతో నిరుపేద వృద్ధురాలకు ఇంటిని నిర్మిస్తున్న కోడూరు జనసైనికులు