పాఠశాల స్థాయి నుండే ప్రపంచానికి గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలి : పాశం నాగబాబు

పాశం నాగబాబు

           నూజీవీడు ( జనస్వరం ) : ముసునూరు మండలంలోని రమణక్కపేట జెడ్పీ హైస్కూల్ లో స్కూల్ లెవెల్ సైన్స్ ఫెయిర్ ప్రదర్శనలో మండల విద్యా శాఖ అధికారి రత్నకుమార్, ప్రధానోపాధ్యాయులు శారద గారి పర్యవేక్షణలో, అధ్యాపకుల అధ్వర్యంలో జరిగిన ఈ సైన్స్ ఫెయిర్ లో విద్యార్దులు దాదాపు 100కి పైగా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన పార్టీ తరపున స్కూల్ సిబ్బందితో కలిసి విద్యార్దులకు బహుమతుల ప్రదానం చేసిన పాశం నాగబాబు, త్రినాథ్, గోపి, సాయి. వారు మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుండే ప్రపంచానికి గర్వించదగ్గ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు పాఠశాల స్థాయి నుండే ఆవిష్కరణల మీద మమకారం, ప్రేమ కలిగించేలా పాఠాలు బోధించాలని సూచించారు. 

See also  పవన్ కళ్యాణ్ గారిని కులాల పేరుతో దూషిస్తే ఖబడ్దార్ : జనసేన నాయకులు మైలేరి మల్లయ్య

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి