
మంత్రి నారా లోకేష్ ఆదేశాలతో మంగళగిరి పౌర గ్రంథాలయంలో కొనసాగుతున్న ఉచిత వేసవి విజ్ఞాన శిబిరం.
మంగళగిరి,మే 17( జనస్వరం)
వేసవి సెలవులను సద్వినియోగం చేసుకునేలా విద్యార్థులకు వినూత్న కార్యక్రమo .ఈ విజ్ఞాన శిబిరంలో భాగంగా పఠనం, సాధారణ విజ్ఞానం, వ్యక్తిత్వ వికాసం, సృజనాత్మక నైపుణ్యాలపై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అలాగే కార్టూన్స్, డ్రాయింగ్, చెస్, పేపర్ క్రాఫ్ట్, మట్టితో బొమ్మలు తయారీ, స్పోకెన్ ఇంగ్లీష్, కంప్యూటర్ విజ్ఞానం వంటి విభాగాల్లో నిష్ణాతులైన ఉపాధ్యాయులచే శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ కార్టూనిస్ట్ శ్రీధర్, ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ భీమనేని వందనాదేవి హాజరయ్యారు. ఉచితంగా నిర్వహిస్తున్న ఈ వేసవి విజ్ఞాన శిబిరం జూన్ 6 వరకు కొనసాగనుంది.








