టిటిడి అటవీ కార్మికులకు అండగా తిరుపతిలో అఖిలపక్షం ఏర్పాటు

     తిరుపతి, (జనస్వరం) : టిటిడి అటవీ కార్మికులకు అండగా తిరుపతిలో అఖిలపక్షం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో జనసేన PAC సభ్యులు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరి ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి అకేపాటి సుభాషిణి, జిల్లా ఉపధ్యక్షులు బత్తిన మధు బాబు, జిల్లా సంయుక్త కార్యదర్శి కీర్తన, తిరుపతి నాయకులు శెట్టిపల్లి చరణ్, హరీష్, ప్రసన తదితరులు జనసైనికులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా హరిప్రసాద్  మాట్లాడుతూ టిటిడి అటవీ కార్మికులు 586 రోజులుగా నిరాహారదిక్ష చేస్తూ కడుపు  కాల్చుకుంటు నిరసన తెలియచేస్తుంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం న్యాయమా! ఎన్నికల ముందు స్వయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మూడు నెలలో రెగ్యులైజ్ చేస్తాననీ మాట ఇచ్చి మూడు ఏళ్లు పూర్తి అయిన ఇచ్చిన హామీలను పట్టించుకోని జగన్ మోహన్ రెడ్డి వైఖరిని ఖండిస్తూ” పేదొడికి కూడా మగబిడ్డ ” అన్నట్లుగా ఫారెస్ట్ వారికి కూడా టైంస్కెలా? పర్మినెంటా? అన్నట్టుగా జగన్ మోహన్ రెడ్డి వైఖరి వుందని, అటవీ కార్మికులకూ ఒక బ్రతుకు వుందని వారికి కుటుంబం వుందని ధరలు విపరీతంగా పెరిగిపోయాయి.పెట్రోల్, డీసెల్ ధరలు, కరెంట్, ఆర్టీసీ, బియ్యం, పప్పు, ఉప్పు, కూరగాయలు ధరలు పెరిపోయాయి. కానీ అటవీ కార్మికుల జీతాలు మాత్రం గొర్రె తోక బెత్తెడు అన్నట్టుగా వుంది. వీరికి ఆదాయం పెరగకుండా పెరిగిన ధరలతో ఎలా జీవించాలో ఎద్దేవా చేసారు. రేపు అఖిలపక్షంతో కలిసి సీఎం జగన్ మోహన్ రెడ్డికి వినతి పత్రం సమర్పిద్దాం అని అన్నారు. కర్షక, కార్మికులకు జనసేనపార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేశారు.

See also  పేదల కోసం "పవనన్న ఆపన్న హస్తం" కార్యక్రమం : సోసియల్ రిఫార్మర్ భరత్

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి