నా సేన కోసం..నా వంతు కు “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” రూ 4,30,079 విరాళం

జనసేన

    న్యూస్ ( జనస్వరం ) : నా సేన కోసం.. నా వంతు.. కార్యక్రమంలో భాగంగా “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” రూ 4,30,079 విరాళం జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు కొణిదెల నాగబాబు గారి చేతుల మీదుగా చెక్కు రూపంలో జనసేన పార్టీకి అందజేశారు. “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” వేణు పులుగుజ్జు, పృథ్వీ యన్నం ఆధ్వర్యంలో సమష్టిగా ఈ విరాళం సేకరించి జనసేన నా సేన కోసం.. నా వంతు కార్యక్రమానికి విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు చేస్తోన్న పోరాటానికి “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” మద్దతుగా నిలబడడం అభినందనీయమని, మంచి పరిపాలన ప్రజలకు అందించటమే జనసేన లక్ష్యమని అన్నారు. చెక్ అందజేసిన వారిలో “ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్” సభ్యులు గూడపాటి గోపాలకృష్ణ, తేజ దామెర్ల, బాలు పులుగుజ్జు, తుకారాం పులుగుజ్జు, నాగార్జున అల, సురేష్ బర్మా, కంచెర్లపాటి సిద్దార్థ ఉన్నారు.

See also  వైసీపీ నాయకుడు బాలాజీ నాయుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి : జనసేన మండల అధ్యక్షులు శోభన్ బాబు

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :