బనగానపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు

బనగానపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు

               బనగానపల్లె జనసేన పార్టీ ఆధ్వర్యంలో పట్టణం లోని పొట్టి శ్రీరాములు గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మిత్రపక్షం బీజేపీ అలాగే MIUL బనగానపల్లె శాఖ వారు కూడా వచ్చి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు గబ్బర్ సింగ (చినబాబు) మరియు భాస్కర్ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం పొట్టి శ్రీరాములు గారి ప్రాణ త్యాగాన్ని తెలుగు ప్రజలు ఎప్పటి మరచిపోలేరని తెలుగు భాష ప్రయుక్త రాష్ట్రం కోసం 58 రోజులు నిరాహారదీక్ష చేయడం మర్చిపోలేము అన్నారు. అలాగే బీజేపీ నాయకులు శరత్ చంద్ర మరియు ఆయిల్ శ్రీనివాసులు మాట్లాడుతూ అప్పటి మద్రాసు రాష్ట్రం లో తెలుగు వాళ్ళను చిన్న చూపు చూడటం తెలుగు ప్రజలకు గుర్తింపు లేకపోడంతో పొట్టి శ్రీరాములు తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని నిరాహార దీక్ష చేసి మనకి ప్రత్యేక రాష్ట్రం వచ్చేలా కృషి చేశారని వారి త్యాగం భావి తరాలకు విలువైనది తెలియచేసారు. ఈ కార్యక్రమంలో జనసేన మరియు బీజేపీ నాయకులు దమ్మల వెంకట సుబ్బయ్య ,జావేద్ బిన్ మహమ్మద్, ప్రసాద్,శివారామిరెడ్డి IUML పట్టణ అధ్యక్షుడు అల్లబకాస్ పాల్గొన్నారు.

See also  జనసేన నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డిని అభినందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్