గుండెపోటుతో మృతి చెందిన కొండయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం

    వింజమూరు, నవంబర్ 5, (జనస్వరం) : వింజమూరు మండలం నేరేడుపల్లి గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త గంగపట్ల కొండయ్య గుండెపోటుతో ఇటీవల మరణించడంతో, వారి కుటుంబాన్ని జనసేన ఉదయగిరి నియోజకవర్గ సమన్వయ కర్త కోట్టే వెంకటేశ్వర్లు పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న ఆయన, కొండయ్య సతీమణి జయంతికి రూ.12 వేల ఆర్థిక సహాయం అందించారు. కుటుంబానికి జనసేన పార్టీ పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వింజమూరు మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, జనసేన నాయకుడు ఇమ్రాన్ మరియు ఇతరులు పాల్గొన్నారు.

See also  కోవూరు నియోజకవర్గం అంగన్వాడి కార్యకర్తల నిరసనలకు మద్దతుగా జనసేన