అద్దంకి జనసైనికుల ఆర్థిక సహాయం

అద్దంకి జనసైనికుల ఆర్థిక సహాయం… 

ఎక్కడ ఏ కష్టం వచ్చినా తమ వంతుగా సహాయం చేయడానికి జనసేన పార్టీ కార్యకర్తలు జనసైనికులు సహాయం చేయడానికి ముందుంటారు. జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడలో నడుస్తున్న జనసైనికులను ఇతరులు కూడా మెచ్చుకోవడం సంతోషకరం. వివరాల్లోకి వెళ్తే అద్దంకి పట్టణానికి చెందిన శ్రీనగర్ కాలనీలో అంకమ్మ కుటుంబం నివాసముంటూ ,  కట్టెలు కొట్టుకుంటూ వాటిని రిక్షా మీద పెట్టి అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. 3 నెలల క్రితం ఎప్పటిలాగే కట్టెలు కొట్టుకుంటు( అద్దంకి  గరటయ్య కాలనీ దగ్గరలో) వస్తున్న మార్గంలో రేణి0గవరం  నుండి వస్తున్న కట్టెల లారీ అదుపుతప్పి వీరి రిక్షా మీద తిరగపడింది. ఆ ప్రమాదంలో వీరి భర్త (అంకమ్మ) అక్కడే మరణించారు. భార్య శివమ్మ 2 కాళ్లు విరిగిపోయాయి. తనకూతురు నాగమణి (2)కి  కూడా కుడి కాలు విరిగిపోయింది.  పాపకు ఆపరేషన్ చేయగా ఇప్పుడు చీము రక్తం కారుతూ పాపకు రోజు ట్రీట్మెంట్ కోసం అనేక ఖర్చులు చేస్తున్నారు . ఆ విషయం తెలుసుకున్న జనసైనికులు ఈరోజు వారికి 5500 డబ్బులు, 25 kg రైస్ నిత్యావసర సరుకులు మరియు కూరగాయలు ఇవ్వడం జరిగింది .

జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్పూర్తితో బత్తుల శివశంకర్ ఆధ్వర్యంలో జనసైనికులా ఆర్ధిక సహాయ కార్యక్రమంలో బత్తుల శివశంకర్, సాధు వెంకటేష్, గోరంట్ల సాయి ప్రకాష్, అంగలకుదుటి వీరాచరి, చందు , సాంబ శివ, మురళి కృష్ణ, వీరు, రమేష్, తదితరులు పాల్గొన్నారు .

See also  సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన జనసేనపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి