అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సాయం

   సిద్దవటం ( జనస్వరం ) :  మండలంలోని ఉప్పరపల్లె గ్రామానికి చెందిన పెద్దకోట్ల చంద్రయ్య (65) ఇటీవల అనారోగ్యానికి గురై బ్రెయిన్ ఆపరేషన్ చేయించుకొని మంచానికే పరిమితమయ్యాడు. ఈ విషయాన్ని రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ దృష్టికి తీసుకెళ్లగా ఆయన తక్షణమే స్పందించారు. జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య శుక్రవారం ఆ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు చెక్కును అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు. జనసేన పార్టీ తరఫున అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు.

See also  కాలుష్యం కోరల్లో బ్రతికి ఉండడానికే పోరాటం చేస్తున్న సర్వేపల్లి నియోజకవర్గం