ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ టాపర్ చిన్నమికి రూ.30,000 ఆర్థిక సహాయం

ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కాలేజీ టాపర్ చిన్నమికి రూ.30,000 ఆర్థిక సహాయం

           కృష్ణా కోడూరు మండలంలోని గంగరాజు పోడు పంచాయితీ పరిధిలో ఉన్న కొండారెడ్డిపోడు గ్రామ నివాసి ఆయనటువంటి అనిమాల చిన్నమి అనే విద్యార్థి డిగ్రీ ( Bzc) యోగి వేమన యూనివర్సిటీ నందు మొదటి స్థానం సంపాదించినది. ఉన్నత చదువుల( గ్రూప్ 2 కోచింగ్) నిమిత్తం వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదు. ఆమె పరిస్థితి తెలుసుకున్న గంగురాజుపోడు జనసైనికులు 30,000 రూపాయిలు ఆర్థిక సహాయం చేయడం జరిగినది. జనసైనికులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరికి ఏం కష్టం వచ్చినా ఆదుకునేందుకు జనసేన పార్టీ జనసైనికులు ముందు ఉంటారని అన్నారు. చిన్నమి ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని తెలిసి మా వంతు సహాయం అందించాము. తాను గొప్పగా ఎదిగి మరింత ఉన్నత శిఖరాలకు ఎదిగి సమాజం కోసం తనవంతు సహాయం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గంగరాజుపోడు జనసైనికులు మరియు కోడూరు నియోజకవర్గ జనసేన నాయకులు ముత్యాల కిషోర్ కుమార్, బందలకుంట రవికుమార్, కడవకూటి జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

See also  బొబ్బిలిలో MY FIRST VOTE FOR JANASENA కార్యక్రమం

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి

తాజా వార్తలు చదవండి :