అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి అమెరికా ఎన్నారై డల్లాస్ జనసేన టీం సభ్యుల ఆర్థిక సహాయం

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి అమెరికా ఎన్నారై డల్లాస్ జనసేన టీం సభ్యుల ఆర్థిక సహాయం

                               నెల్లూరు జిల్లా మర్రిపాడు మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి కి ఆర్థిక సాయం అందించిన NRI డల్లాస్ జనసైనికులు. పార్టీ పటిష్టం చేయడంతో పాటు కష్టాల్లో ఉన్నవారిని అదుకుంటూ  NRI జనసేన సభ్యులు చేస్తున్న సేవలు అభినందనీయమని నెల్లూరు జిల్లా జనసేన నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు అన్నారు. చిరంజీవి యువత కార్యాలయంలో సోమవారం అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తికి  వైద్యం కోసం అమెరికా NRI డల్లాస్ జనసేన టీం సభ్యులు అందచేసిన 10వేల రూపాయలను అందచేశారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆనంతసాగరం మండలం మంచాలపల్లి గ్రామానికి చెందిన కాకి అశోక్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడాన్ని గుర్తించి NRI జనసేన సభ్యులతో మాట్లాడి ఆర్థిక సాయం అందిచడం లో చిన్నా జనసేన కృషి ఎంతో ఉందన్నారు. అనంతరం చిన్నా జనసేన మాట్లాడుతూ పార్టీ కార్యక్రమాలతో పాటు జనసైనికులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నNRI సభ్యులు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయ్, గంటా అంజి, పెనగలూరి చిన్నయ్య, యనాదయ్యలు పాల్గొన్నారు. 

 

See also  రాష్ట్రానికి పట్టిన గ్రహణం సీఎం జగన్ వైసీపీ పార్టీ

ఇవి కూడా చదవండి :

ఫేస్ బుక్ ఫాలో అవ్వండి