ఖో ఖో లో అద్బుత ప్రతిభ చూపిన కృష్ణవేణి విద్యార్ధినులు.

కృష్ణవేణి డిగ్రీ కళాశాల విద్యార్ధినుల ఘన విజయం

నరసరావుపేట.ఫిబ్రవరి 28 ( జనస్వరం)

పట్టణంలో నిర్వహించిన అంతర్ విశ్వవిద్యాలయ మహిళా ఖో-ఖో టోర్నమెంట్‌లో కృష్ణవేణి డిగ్రీ కళాశాల మహిళా ఖో-ఖో జట్టు అద్భుతమైన ప్రతిభ కనబరచి చాంపియన్‌గా నిలిచింది.ఈ టోర్నమెంట్ అనంతరం అధికారులు ప్రకటించిన ఆచార్య నాగార్జున యూనివర్సిటీ మహిళా ఖో-ఖో జట్టుకు కృష్ణవేణి డిగ్రీ కళాశాల నుంచి ఐదుగురు విద్యార్థినులు ఎంపికయ్యారు.ఎం.శిరీష,ఎం.హేమలత,బి. అలేఖ్య,ఎం. సౌదేశ్వరి,కె. అనుష బాయి ఎంపికైన ఏఎన్‌యూ మహిళా ఖో-ఖో జట్టు మార్చి 2వ తేదీ నుంచి కర్ణాటక రాష్ట్రంలోని దావణగిరి విశ్వవిద్యాలయం లో జరగనున్న సౌత్ జోన్ అంతర్ విశ్వవిద్యాలయ ఖో-ఖో పోటీల్లో పాల్గొననుంది.ఈ విషయాన్ని కళాశాల ప్రిన్సిపాల్ నాతాని వెంకటేశ్వర్లు అధికారికంగా ప్రకటిస్తూ ఎంపికైన విద్యార్థినులను అభినందించారు.ఈ విజయానికి తోడ్పడిన ఫిజికల్ డైరెక్టర్ ఆది బాబు, కోచ్‌లు ఎస్.డి.మహమ్మద్, ఎస్‌కే. షకీలాలకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వహించిన అభినందన కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాళ్లు సతీష్, తిరుపతిరావు పాల్గొని విద్యార్థినులను ప్రశంసించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

See also  డా.సునీల్ శ్రీవల్లి ఇంటర్నేషనల్ హోమియో కేర్ ప్రారంభించిన టిడిపి జిల్లా ఉపాధ్యక్షుడు దరువూరి నాగేశ్వరరావు